Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సరూర్నగర్
దసరా పండగకు ఊరికి వెళ్తే ప్రజలు దొంగతనాల నివారణ గురించి పోలీస్ సూచనలు తప్పకుండా పాటించాలి అని చైతన్యపురి సీఐ బి. రవికుమార్ అన్నారు. మాట్లాడుతూ ఊరికి వెళ్లే సమయంలో వీలుఅయినంత మేరకు ఇంట్లో విలువైన వస్తువులు, నగదు, బంగారు ఆభరణాలు ఉంచకుండా బ్యాంక్ లాకర్లో, భద్రంగా ఉన్న చోట దాచుకోవడం ఉత్తమం అన్నారు. ఇంటికి నాసిరకం తాళాలు వాడొద్దు అన్నారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగలు భయపడే అవకాశం ఉంది అని, భద్రత ఎక్కువగా ఉంటుంది అన్నారు. ఊరికి వెళ్లిన సమయంలో పక్కింటి వారికి, స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి అన్నారు. ఇంట్లో ముందు గదిలో లైట్ వేసి ఉంచాలి అన్నారు.