Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మత్తులో కురుకూపోతున్న యువత
వద్దన్నా పదేపదే హెచ్చరించినా వినరే
ప్రమాదమని తెలిసినా మత్తు మాయ నుండి బయటికి రావడంలేదు
నవతెలంగాణ-బంజారాహిల్స్
మత్తు అనే పదం మనిషికి ఎంతో చెడని, మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న వారు ఎంతటి వరైనా కఠిన శిక్షతోపాటు జీవితం లో మరోమారు ఈ తప్పిదం చేయవద్దు అనే విధంగా చేయాలనే దఢ సంకల్పంతో నగర సీపీ అంజనీకుమార్ మాదకద్రవ్యాల ఏరివేతపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగిస్తున్నారు. ఏది సాగిన మూన్నాళ్ళ ముచ్చటే అన్నట్టు పశ్చిమ మండల కేంద్రమైన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గంజాయి ముఠాను స్పెషల్ డ్రైవ్‌లో భాగంగానే పక్కా సమాచారంతో పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సార్ నగర్, అమీర్‌పేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మత్తు మందును విక్రయిస్తున్న గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు అమీర్‌పేట, ఎస్సార్ నగర్లో గత కొన్ని రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకు న్నారు. నిందితుల్లో ఒక మహిళ, ఆరుగురు పురుషులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదుచేసి ఎస్పార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు వెల్లడించారు.