Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
అనాథల మధ్య జన్మదిన వేడుకలను జరుపుకోవటం అదష్టంగా భావిస్తున్నానని మాజీ స్పీకర్ మధుసూధ నాచారి అన్నారు. సమాజంలో ఉన్న ఎంతో మంది దిక్కూ మొక్కు లేని అనాథలను చేరదీసి వారిని మానవతా హదయంతో అదుకోవటం నిర్వాహకుల మానవత్వాన్ని నిరూపిస్తుందని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్ సరికొండ మధుసూదనాచారి అన్నారు. గురువారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న నాదర్గుల్ గ్రామంలోని మాత దేవోభవ అనాథ అశ్రమంలో బాలాపూర్ మండల స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు రవీంద్రాచారి ఆధ్వర్యంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మరెడ్డితో కలిసి అనాథల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కషి చేస్తున్నారని తెలిపారు. మాత దేవోభవ అనాథ అశ్రమ నిర్వాహకులు గట్టుగిరి ఎంతో మంది అనాథలను చేరదీసి మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన మానవతా హదయంతో సేవ చేయటం మానవత్వాని చాటుకుంటు న్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట శ్రీధర్ రెడ్డి, గూడెపు ఇంద్రసేన, కోఆప్షన్ సభ్యలు మర్రి జగన్ మోహన్‌రెడ్డి, నాయకులు మర్రి శశాంక్ రెడ్డి, ఎర్రబటు శ్రీనివాస్, స్వర్ణకారుల సంఘం నాయకులు మధన్ మోహన్‌చారి, చంద్రమౌళి, జగదీశ్వరాచారి, వేణుగోలచారి, సుదర్శన్ చారి, కేశవాచారి, బాలేశ్ చారి, గురుచరణ్, సునీల్, అగర్వాల్, లక్ష్మి రామాచారి తదితరులు పాల్గొన్నారు.