Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పర్యాటక అభివద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్త
నవతెలంగాణ - సరూర్‌నగర్
తెలంగాణను ఆకుపచ్చ రాష్ట్రంగా తీర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది అని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్త అన్నారు. గురువారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ - తెలంగాణ ఆధ్వర్యంలో 1100 దేవాలయాల్లో 1100 జమ్మి చెట్టు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఎంపీ, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ''ఊరి ఊరికో జమ్మి చెట్టు, గుడి గుడికో జమ్మి చెట్టు'' మొక్కలు నాటే కార్యక్రమంకు ముఖ్యతిథిóగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా టూరిజం కార్పొరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్త మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో ప్రజలకు, భావితరాలకు స్వచ్ఛ మైన ఆక్సిజన్ అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణకు హరితహారం కార్యక్ర మం చేపట్టారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం లో కోట్లాది మొక్కలు నాటుతూ తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మారుస్తూ కలియుగ అశోక చక్రవర్తి లాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తరువాత 24 శాతం ఉన్న గ్రీనరీని 33 శాతం పర్సెంట్‌కు పెంచడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ప్రకాష్గుప్త, కన్యకా పరమేశ్వరి దేవాలయం అధ్యక్షుడు ప్రవీణ్గుప్త, గౌరవ అధ్యక్షుడు కైలాష్గుప్త, మహంకాళి సురేష్, రమేష్, శ్రీనివాస్, శంకర్, దారం సతీష్ లక్ష్మణరావు, ఉప్పల రమేష్, నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.