Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలో దసరా పండుగ సందర్భంగా గురుకుల కళాశాల మైదానంలో జనచైతన్య సేవా సమితి వ్యవస్థాపకుడు ఘట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని. యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ ముళ్లి.పావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ పలుగుల.మాదవ్‌రెడ్డి పాల్గొన్ని ఆయుధపూజ రావణ దహన కార్యక్రమాన్ని జరిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విజయదశిమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణ్‌పై గెలిచిన సందర్భమే దసర పండుగ అంటారు. పాండవులు వనవాసం వెళుతూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్స్లర్లు కో-అప్షన్ సభ్యులు జనచైతన్య సేవా సమితి సభ్యులు మాజీ సర్పంచ్, మాజీ వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీిలు తదితరులు పాల్గొన్నారు.