Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
సికింద్రాబాద్‌లో అభివద్ధి సంక్షేమ శకం సాగుతోందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు మేలు చేకూర్చే పనుల్లో రాజీ పడబోమని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావుగౌడ్ అన్నారు. ప్రజలకు పద్మారావుగౌడ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. లాలాపేటలో దాదాపు రూ.7కోట్ల ఖర్చుతో ప్రతిపాదిస్తున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం పనులకు పద్మారావుగౌడ్ దసరా రోజు శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఏ మహమ్మారి వల్ల ఇబ్బందులు పడరాదని ఆకాంక్షిస్తున్నట్లు పద్మారావుగౌడ్ తెలిపారు. దాదాపు 800 గజాల స్థలంలో మూడు అంతస్తుల్లో అధునాతన హంగులతో ఫంక్షన్ హాల్ నిర్మించి, లాలాపేట ప్రజల కలను నేరవేర్చనున్నామని తెలిపారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి, కార్పొరేటర్లు, సామల హేమ, కంది శైలజ టీఆర్ఎస్ యువ నేత రామేశ్వర్‌గౌడ్, త్రినేతగౌడ్, టీఆర్ఎస్ కార్మిక విభాగం నేత మోతె శోభన్ రెడ్డి, సునీల్, శ్రీనివాస్ గౌడ్, నాగేస్వేర్, సునీల్.ముదిరాజ్, కురెల్లి. నాగరాజు, వివిధ పార్టీల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు