Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ హత్యకు గురైన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చక్రిపురం కటింగ్ కాలనీ లో నివాసముండే లలిత (56) కష్ణానగర్ కాలనీలో నివాసముండే తన సోదరి కుమారుడు టైలర్ శంకర్ ఇంటికి వచ్చింది. చక్రిపురం భగవాన్ నగర్లో టైలర్ షాప్‌కు వెళ్లి వస్తానని శంకర్, అతని భార్య ఇందిర, చిన్న కుమారుడు టైలర్ షాపుకు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చేసరికి సోఫాలో హత్యకు గురై కనిపించడంతో శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ మన్మోహన్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు నిర్వహించి పలు వివరాలు సేకరించారు. మతురాలు లలిత అక్క కుమారుడు శంకర్ కుమారుడు అర్జున్ (26)గత కొంతకాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవలే ఇంటికి చేరుకున్నట్లు తండ్రి శంకర్ తెలిపారు. గత వారం రోజులుగా మానసిక రుగ్మత ఎక్కువవ్వడంతో విపరీతంగా ప్రవర్తిస్తున్నాడని తన కుమారుడు అర్జున్ (26)పాల్పడి ఉంటాడని తండ్రి పోలీసులకు తెలిపాడు.ముఖంపై రాయితో మోది చంపి ఉంటాడని పోలీసులు ఈ క్రమంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
.