Authorization
Wed April 09, 2025 05:37:26 pm
నవతెలంగాణ-హయత్నగర్
ప్రతివారం రాచకొండ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా తనిఖీలు నిర్వహించి మోటార్ వెహికిల్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని, స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రజలకు, వాహనదారులకు కౌన్సిలింగ్ ద్వారా ఉన్నతాధికారుల సూచనల మేరకు అవగాహన కల్పిస్తున్నామని ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 9 నుంచి 15వ తేదీ వరకు 47,224 కేసులు నమోదు కాగా, రూల్స్ ఉల్లంఘించిన వారి నుంచి రూ. ఒక కోటి, 44 లక్షల, 58వేల ఒక వంద నగదును వసూలు చేసి ప్రభుత్వానికి జమచేసినట్లు తెలిపారు. హెల్మెట్ లేకుండా టూ వీలర్స్ నడిపిన వారిపై 26,508 కేసులు నమోదు కాగా, రూ.49,05,100 నగదు వసూలయ్యాయి. సీట్ బెల్టు లేకుండా కార్లు నడిపిన వారిపై 254 కేసులు నమోదు కాగా, రూ.25,400 నగదు జమ అయింది. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై 1014 కేసులు నమోదు కాగా రూ.5,07,000 నగదు జమ అయింది. పరిమితికి మించి ప్యాసింజర్లను కూర్చోబెట్టినందుకు గాను 45 మందిపై కేసులు నమోదు కాగా రూ.8,900 నగదు జమ అయింది. అదనపు ప్రొజెక్షన్కు గాను 355 కేసులు నమోదు కాగా రూ. 35,500 నగదు, ఓవర్ స్పీడ్తో వెళ్తున్న వారిపై 1479 కేసులు నమోదు కాగా రూ.14 లక్షల 79 వేలు, సిగల్ జంప్ అయిన వాహనదారులపై 265 కేసులు నమోదు కాగా రూ.2,65,000 నగదు ప్రభుత్వానికి జమ అయింది. డేంజర్ డ్రైవింగ్ చేసిన వారిపై 36 కేసులు నమోదు కాగా రూ.36,000 నగదు జమ అయింది. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపిన వారిపై 91 కేసులు నమోదు కాగా రూ.91,000 నగదు ప్రభుత్వానికి జమ అయ్యాయి. వారం రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారిపై రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి డివిజన్లో 9 కేసులు నమోదు కాగా, 86 మందిపై కేసులు నమోదయ్యాయి. ఉప్పల్ డివిజన్లో 21 కేసులు నమోదయ్యాయి. ఎల్బీ నగర్ డివిజన్లో 15మందిపై కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా వనస్థలిపురంలో 19 కేసులు, భువనగిరి 15 కేసులు, చౌటుప్పల్లో 31 కేసులు, కుషాయిగూడలో 4 కేసులు, యాదాద్రిలో 16 కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైన వారిలో మైనర్లు కూడా ఉన్నారు.
రోడ్ ప్రమాద కేసులు 55, వారం రోజుల్లో రోడ్ ప్రమాదం జరిగిన ఘటనలపై మొత్తం55 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 43 మందికి గాయాలు కాగా 10 మంది మత్యువాత పడ్డారు. ఎక్కువగా మానవ తప్పిదా లవల్లే రోడ్డు ప్రమాదలు జరుగుతున్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, అతివేగంగా డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ఫ్ స్కిడ్ కావడంవల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఇంజనీరింగ్, లా అండ్ ఆర్డర్ పోలీస్ అధికారులతో కలిసి నిర్ధారించారు.