Authorization
Wed April 09, 2025 10:37:31 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
బాటసింగారం లాజిస్టిక్ పార్క్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డిలతో కలిసి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ నగరంలోని కొత్తపేట నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, కోహెడ గ్రామానికి తరలించేందుకు ప్రభుత్వం గతంలో రేకుల షెడ్ సిద్ధం చేసింది. అప్పట్లో భారీ వర్షానికి షెడ్ కూలిపోవడంతో అక్కడి నుంచి తిరిగి కొంత కాలంగా కొత్తపేట గడ్డి అన్నారంలోనే మార్కెట్‌ను కొనసాగిస్తున్నారు.
అప్పటికే గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ స్థలంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టేందుకు సీఎం కేసీఆర్ అక్కడి నుంచి పండ్ల మార్కెట్ తరలించేందుకు సిద్ధం చేస్తూ తాత్కాలికంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలో నిర్మించిన లాజిస్టిక్ పార్క్‌లో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, పండ్ల మార్కెట్ చైర్మెన్ కందాడ ముత్యంరెడ్డి, డైరెక్టర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, స్థానికులు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.