Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పేట/కాప్రా/అంబర్‌పేట/బాలానగర్
/ఓయూ/శామీర్‌పేట్
తూంకుంట మున్సిపాలిటీ, శామీర్ పేట, మూడు చింతలపల్లి మండలాల్లో ప్రజలు దసరా పండగ ఘనంగా జరుపుకున్నారు. కొత్తబట్టలు ధరించి, పొలాల్లోకి వెళ్లిపాలపిట్టను చూసి శమీ చెట్టు కింద పూజలు నిర్వహించారు. పలువురు ఉదయం పూట ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు. ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఒకరికొకరు శమీ ఆకు అందజేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తూం కుంట మున్సిపాలిటీ పరిధి దేవర యంజాల్లో రావణాసుర దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తూంకుంట మున్సిపల్ చైర్మెన్ కారంగుల రాజేశ్వర్ రావు, వైస్ చైర్మెన్ పన్నాల వాణి వీరారెడ్డి, స్థానిక కౌన్సిల్లర్లు పి.నర్సింగ్ గౌడ్, ఈ.ఉమా శ్రీనివాస్ ముదిరాజ్, బాకోళ్ల యాదమ్మ నర్సింగ్, శామీర్‌పేట మాజీ ఎంపీపీ నాలిక యాదగిరి, మాజీ సర్పంచులు బోజేశ్వర్ రావు, గోల్డ్ శ్రీనివాస్ ముదిరాజ్, ఆలయ కమిటీ చైర్మెన్ పన్నాల సుధాకర్ రెడ్డి, నాయకులు దూసరి మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్‌లో..
దసరా సందర్బంగా మల్లాపూర్ వార్డ్ ఆఫీస్ నుంచి నందీశ్వర ఆలయం వరకు బ్యాండ్ బాజాలతో జమ్మి వద్దకు ర్యాలీగా వెళ్లి శమీ పూజ నిర్వహించారు. కార్యక్రమానికి మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, నాచారం సీఐ తొగరు కిరణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయ ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
అంబర్‌పేటలో..
అంబర్ పేట పరిధిలో మహంకాళి దేవస్థాన సమితి వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దసరా ఉత్సవాలు, దాండియా, బతుకమ్మ, కోలాటాలు, రావణ దహన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాజీ రాజ్యసభ సభ్యులు వీహెచ్ హనుమంతరావు, దేవస్థాన సమితి అధ్యక్షులు సత్తిబాబుగౌడ్ హాజరయ్యారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కన్నె రమేష్ యాదవ్, దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్, ఇ.విజరు కుమార్‌గౌడ్, పద్మావతి వెంకటరెడ్డి, మాజీ కార్పొరేటర్ పంజాల జ్ఞానేశ్వర్ గౌడ్, పద్మావతి రెడ్డి, పులిజగన్, సీనియర్ నాయకులు దుర్గప్రసాద్ రెడ్డి, గడ్డం శ్రీధర్‌గౌడ్, సుధాకర్, చంద్రశేఖర్, తదితర నాయకులు పాల్గొన్నారు.
దసరా 4
లాలగూడలో..
బీజేపీ సినియర్ నేత వెంకటేష్‌గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి లాలాగూడ గ్రౌండ్లో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రామచంద్రం పాల్గొని మాట్లాడుతూ.. కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కొన్న ఘనత భారత దేశానిది అన్నారు. దసరా పండుగ మన రాష్ట్ర సంస్కృతికి నిదర్శనమని చెప్పారు. కార్యక్రమంలో వెంకటేష్ గౌడ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
బాలానగర్‌లో..
దసరా పండుగ సందర్భంగా బాలానగర్ డివిజన్ పరిధిలోని వినాయక్‌నగర్‌లో టీఆర్ఎస్ నాయకుడు పులి శ్రీకాంత్ పటేల్ ఆధ్వర్యంలో శుక్రవారం రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫతే నగర్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ మాట్లాడుతూ.. శ్రీరాముని కాలం నుంచే విజయదశమిని విజయ ప్రస్థానంగా పరిగణించారని తెలిపారు. రాముడు రావణునిపై దండెత్తి విజయం సాధించారని, నాటి నుంచి రావణ దహనం అనే సంప్రదాయం కొనసాగుతోందని చెప్పారు. అనంతరం ఎస్ఐ రాజేష్ గౌడ్, ఎన్.రమేష్, మహిళా కానిస్టేబుల్ శ్వేత, అంజలి, కానిస్టేబుల్ విశాల్ తదితరులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో పులి శ్రీ కాంత్ పటేల్, శ్రావణ్ పటేల్, వెంకటేష్ గౌడ్, బండారి నవీన్ గౌడ్, అంబటి సునీల్ కుమార్, టీఆర్ఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాజా, ఎలిజాల యాదగిరి, బాబా అహ్మద్, రమేష్ కందుల, టీఆర్ఎస్ క్రిస్టియన్ మైనారిటీ ప్రధాన కార్యదర్శి ఎన్.వి. రత్నం, మహిళా నాయకురాలు కవిత, సుజాత గౌడ్ తదితరులు పాల్గొన్నారు.