Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సూచనల మేరకు గౌతమ్‌నగర్ డివిజన్ పరిధిలో శనివారం కురిసిన వర్షానికి రోడ్లు వరదనీటితో జలమయమై లోతట్టు ప్రాంతాలను ఆదివారం టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల రాముయాదవ్ పరిశీలించారు. అనంతరం జీహెచ్ఎంసీ సిబ్బందితో రోడ్డుపై ఉన్న మట్టి, చెత్తా చెదారంను క్లీనింగ్ చేయించారు. అలాగే డివిజన్ పరిధిలోని వెంకటాద్రినగర్‌లో జరుగుతున్న డ్రయినేజీ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.