Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
వివర్స్ కాలనీలో శ్రీ భావనారుషి కాలనీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. సలహాదారులుగా భాస్కర్‌గౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యక్షులుగా నవీన్‌గౌడ్, ప్రధాన కార్యదర్శిగా కళ్లెం రాము, ఉపాధ్యక్షులుగా రామన్న, సదానంద్ గౌడ్, రవీందర్‌రెడ్డి, కోశాధికారి చుక్క రాజు, జాయింట్ సెక్రెటరీ శాంతకుమార్, సాయిరాం, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ భరత్ రాజు, సోమ రమేష్, జనార్ధన్, సుధీర్, కర్ణాకర్, దుర్గయ్య, విజరు, శ్రీనివాస్, బాలకృష్ణను కాలనీవాసులు ఎన్నకున్నారు. ఈ సందర్భంగా గత కార్యవర్గంలో ఉన్న జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ, శ్రీనివాస్, సలహాదారులు మాట్లాడుతూ పాత కమిటీ యాక్టివ్‌గా లేనందున మాజీ అధ్యక్షుడు కిషో ర్‌రెడ్డి, మాజీ కోశాధికారి సతీష్ సరైన కార్యాచరణ లేకపో వడం వల్ల కమిటీని రద్దు చేసినట్టు తెలిపారు. నూతన అధ్యక్షుడు నవీన్‌గౌడ్, కళ్లెం రాము మాట్లాడుతూ అభివృద్ధి కోసం ఎల్లవేళలా పాటు పడుతామనీ, కో-ఆపరేటివ్ సొసైటీ చేయాల్సిన పనులు జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజా ప్రతినిధులతో అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు.