Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
చారిత్రక చార్మినార్ జల కళతో సందడిగా మారింది. ట్యాంక్ బండ్ హంగులను నగరం నడిబొడ్డులో చార్మినార్ ఆకట్టుకుంది. చార్ కమాన్ లాడ్ బజార్ మక్కా మసీద్ పరిసర ప్రాంతాలు రంగురంగుల దీప కాంతులతో వివిధ షాపింగ్ ఆటపాటలతో విడుదల చేస్తూ సందర్శకులు సాయంకాలం ఎంతో ఆహ్లాదాన్ని, అనుభూతిని ఆశీర్వదించారు.
కొత్త సాయంత్రం
కొగొత్త వాతావరణంతో పాతనగర చారిత్రక ప్రాంతాలు కొత్త శోభను పర్యాటకులకు పరిచయం చేసింది. ఎక్క చూసినా సందర్శకులు తమ మధురానుభూతులను పదిల పర్చుకుంటూ మిరుమిట్లు గొలిపే లేజర్ షో లైట్ల వెలుగుల్లో మురిసి పోయారు. ఆదివారం చారిత్రక చార్మినార్ వద్ద నిర్వహించిన సండే ఫన్డే అధికారులతోపాటు ప్రజల్లో, వ్యాపార వర్గాల్లో జోష్ నింపింది. చారిత్రక చార్మినార్ వద్ద నిర్వహించి ఫన్ డే స్టేజీ లైవ్ షో యువతను ఉర్రుతలూగించింది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా సంగీత హౌరులో హుషారుగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ మదిలో గీతాలు ఆలపిస్తూ సింగర్లకు తోడుగా తమ స్వరాలను సవరించుకున్నారు.
దక్కన్ ఫుడక్కు ఫిదా
ఫన్ డేలో భాగంగా చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన ఆహార స్టాళ్లలో పర్యాటకులు అధికంగా దక్కన్ ఫుడ్‌పై తమ దృష్టిని సారించారు. సాయంత్ర వేళ్లలో పానీపూరి అమితంగా ఇష్టపడే నగర వాసులు కొత్త టేస్ట్ కోసం కబాబ్ రుచిని ఆస్వాదించారు. పాత నగరంలోని వివిధ ప్రాంతాల్లో లభించే దక్కన్ ఫుడ్ స్టాళ్లలో ప్రజలు తమ జిహ్వచాపల్యాన్ని ప్రదర్శించారు. కబాబ్‌లతోపాటు ఇరానీ ఛారు టేస్ట్ చూసి మైమరిచిపోయారు. చిన్నారులతోపాటు పెద్దలు సైతం పీచు మిఠాయిల తీపిని రుచి చూస్తూ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో షాఫింగ్ను కొనసాగించారు.
లాడ్ బజార్లో కొత్త జోష్
చారిత్రక ప్రదేశం చార్మినార్ అనగానే ముందస్తుగా గృహిణులకు టక్కున గుర్తుకు వచ్చేది మాత్రం లాడ్ బజారే. తమకు నచ్చిన రకరకాల గాజులకు పెట్టింది పేరైన లాడ్ బజార్లో షాపింగ్ చేయకుండా వెనుతిరగరంటే అతిశయోక్తి కాదు. ఫన్ డే రోజులో భాగంగా చార్మినార్ పరిసర ప్రాంతాలను సందర్శించిన పర్యాటకులు లాడ్ బజార్లో షాఫింత్తో మార్కెట్లు కొత్త జోష్‌ను పరిచయం చేశారు. కరోనా తర్వాత అతిపెద్ద మార్కెట్ వ్యాపారం ఈ ఆదివారం ఏర్పడింది. ఫన్డే నిర్వహణతో మా అంచనాలను కంటే భిన్నంగా మార్కెట్ కొనసాగిందని వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.