Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్నగర్
ఆర్కేపురం డివిజన్ ఎస్సీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా మాధవి నియామకం అయ్యారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పదవీ బాధ్యతని అప్పగించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, సహకరించిన డివిజన్ మాజీ అధ్యక్షుడు ఆరవింద్ శర్మకి, నూతన అధ్యక్షుడు నగేష్, సాజిద్, విజయభారతిలకి కతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్ట్టేె పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్తాన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నగేష్, మాజీ అధ్యక్షులు ఆరవింద్శర్మ, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంచెర్ల శేఖర్ పాల్గొన్నారు.