Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
నేర రహిత సమాజం కోసం సీసీ కెమెరాలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని సీఐ స్వామి అన్నారు. ఆదివారం అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఇనాంగూడ గ్రామంలో సీసీ కెమెరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ ఇనాం గూడ గ్రామస్తులు సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ. 2.5 లక్షలు విరాళం సమకూర్చడం అభినందనీయమని అన్నారు. నేరాలు పాల్పడిన వ్యక్తులను సీసీ కెమెరాల ద్వారా పసిగట్టి, వారిని త్వరగా గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. అబ్దుల్లాపూర్మెట్ మండలం నగర శివారు ప్రాంతాలు కావడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై వీరభద్రం, సర్పంచ్ అంతటి యశోద ఊశయ్య, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.