Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
వనస్థలిపురం డివిజన్ పరిధిలోని జలపతిరెడ్డి ఆర్థోపెడిక్ క్లినిక్‌లో ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరాన్ని చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మందల జలపతిరెడ్డి, ప్రముఖ గైనకాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ప్రవీణరెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా ఆర్థోపెడిక్, స్త్రీలకు సంబంధించిన పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య శిబిరానికి స్థానిక ప్రజల నుండి విశేష స్పందన వచ్చిందన్నారు. సుమారుగా 40 మంది రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించామని, ఈ అవకాశాన్ని స్థానిక ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ క్లినిక్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలను కొనసాగిస్తామని, పేద ప్రజలకు తమ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు.