Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
ఉత్తమ గాయకులకు మంచి అవకాశాలు వస్తున్నాయని భాష, ఉచ్చారణ పట్ల శ్రద్ధ వహించాలని నటుడు గాయకుడు సాయి కిరణ్ అన్నారు. శ్రీత్యాగరాయ గాన సభలో ఆదివారం ఔత్సాహిక గాయకులతో ఎనిమిది ఘంటలు నిర్విరామ గాన లహరి జరిగింది. మూన్ మ్యూజికల్స్ సంస్థ నిర్వహణలో జరిగిన ఈ మెగా కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన గాయకులు ప్రసాద్, హరిహారాన్, దేవ కృష్ణ, నటరాజ, ద్వారక నాథ్, శ్రీధరన్, కృష్ణవేణి, కృష్ణకుమారి అపర్ణ, డాక్టర్ శాస్త్రి, గణపతి, వినరు బాబు తమ్మినేని ఇలా దాదాపు 30కి పైగా గాయకులు తమ గళలను వినిపించారు. వీరితోపాటు ప్రముఖ గాయకులు బాలకామేశ్వర రావు, ప్రవీణ్ కుమార్, సుబ్బు కూడా పాలుపంచుకొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నటుడు సాయికిరణ్ పాల్గొని గాయకులను అభినందించారు. సంస్థ నిర్వహకురాలు జ్యోతిర్మయి బొమ్మ మాట్లాడుతూ ఔత్సాహిక గాయకులను ప్రోత్సహించటమే తమ లక్యం అన్నారు. మ్యూజిక్ ఇండియా స్థాపకులు ప్రకాష్ చోప్రా, రాకేష్ మరిగంటి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.