Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
ఎండి.జహంగీర్
నవతెలంగాణ -బొమ్మలరామరం
జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం దీక్షలను చేపడుతున్నట్టు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో మండల 7వ మహాసభను సల్లూరి కుమార్, ముక్కెళ్ల పున్నమ్మ అధ్యతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం మండల కేంద్రాల్లో డిసెంబర్ 22.23 తేదీల్లో నిర్వహించే దీక్షలను జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు వ్యతిరేకంగా పోరాటాలు ఉధతం చేయాలని అన్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో 48 గంటల కలెక్టర్ కార్యాలయం ఎదుట తలపెట్టిన దీక్షల్లో మండలం నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మండలంలోని శామీర్‌పేట్ రిజర్వాయర్‌గా చేపట్టి మండలంలోని అన్ని గ్రామాల్లో సాగు, తాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలోని రోడ్డు సౌకర్యం చేపట్టాలని , బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. మండలంలో కంపెనీల ద్వారా వర్ధ కాలుష్యం అధికంగా ఉంటుందని కలుషిత నీరు బయటికి రావడం వల్ల మూగ జీవాలు మృతిచెందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, మండల కార్యదర్శి రేకల శ్రీశైలం, నాయకులు గొలనకొండ బ్రహ్మచారి, మేడబోయిన కిష్టయ్య, బుక్క రమేష్, కష్ణయ్య, లావుడియా రాజు నాయక్, నరసింహ,చితరమ్మ, నరసింహ నాగమణి కష్ణయ్య నరసింహ భాగ్యలక్ష్మి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.