Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -నల్లగొండ
జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజలు, అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించే గ్రీవెన్స్ డే ఈ నెల 18వ తేదీన రద్దు చేసినట్టు డీఐజీ ఏవి.రంగనాథ్్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.పలు కేసుల విచారణ, సమావేశాలు ఉన్న క్రమంలో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే రద్దు చేసినట్టు ఆయన తెలిపారు. ప్రజలు, అర్జీదారులు తమతో సహకరించాలని ఆయన కోరారు. ప్రజలు అర్జీలు సమర్పించేందుకు రావద్దని పేర్కొన్నారు. తదుపరి సోమవారం గ్రీవెన్స్ డే యథావిధిగా నిర్వహించనున్నట్టు తెలిపారు.