Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
భార్య, భర్తలు పరస్పరం సహకరించుకొంటే వారి వారి రంగాల్లో విజయం తథ్యమని ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ వోలెటి పార్వతీశం అన్నారు శ్రీత్యాగరాయ గానసభలో సోమవారం ఆరాధన సాంస్కతిక సంస్థ 26వ వార్షికోత్సవం సందర్భంగా 'విజయంలో భార్యభర్తల భాగస్వామ్యం' పేరిట వివిధ రంగాల్లో పేరొందిన ప్రముఖులను సత్కరించారు. జీవీ సోమయాజులు,లక్ష్మి, సుబ్బారెడ్డి, నాగ మల్లి స్వరమ్మ, జి. సంతోష్, శైలజ దంపతులను ఉజ్జయిని మహంకాళి ఆలయ అర్చక దంపతులు రామతీర్ధ శర్మ, రాజ్యలక్ష్మి సత్కరించారు. సౌజన్యమూర్తి చిల్ల రాజ శేఖరరెడ్డి అధ్యక్షత వహించిన సభలో జర్నలిస్ట్ శ్రీనివాస్ శాస్త్రి, నటుడు దీపికాప్రసాద్, సామాజిక కార్యకర్తలు మధుసూదన్, ఉపేంద్ర చారి లకు ఆత్మీయ సత్కారం చేశారు. కార్యదర్శి లోకం కష్ణయ్య సంస్థ నివేదిక సమర్పించారు. పద్మశ్రీ, త్యాగరాజు నిర్వహణలో సినీ సంగీత విభావరి ఆకట్టుకొంది.