Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
మంగళవారం నాటి మిలాద్ ఉన్ నబి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని పహాడీ షరీఫ్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు ముస్లిం మైనార్టీలకు సూచించారు. సోమవారం మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ... మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా నిర్వహించే ర్యాలీ ప్రశాంతంగా, ఎవరికీ ఇబ్బంది లేకుండా కొనసాగించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ర్యాలీలో పాల్గొనాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సైలు, పోలిస్ సిబ్బంది, ముస్లిం మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.