Authorization
Wed April 09, 2025 04:23:00 pm
నవతెలంగాణ-శామీర్‌పేట/మూడు చింతలపల్లి
మానవ సేవే మాధవసేవ అని మూడు చింతలపల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు గుండ్లపల్లి మల్లేష్‌గౌడ్ అన్నారు. మండలంలోని కొల్తూరు గ్రామానికి చెందిన కాసుల లక్ష్మణ్ అనారోగ్యంతో మృతి చెందారు. మృతుని కుటుంబ సభ్యులను గుండ్లపల్లి మల్లేష్ గౌడ్‌తో పాటు పలువురు నాయకులు పరామర్శించారు. రూ. ఐదు వేల నగదు అందజేశారు. కొండ సత్యనారాయణ కూడా తనవంతు సహాయకరంగా రూ. 2 వేలు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మేడ్చల్ జిల్లా వైస్ చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు దుర్గం వెంకటేష్ ముదిరాజ్, మాజీ అధ్యక్షుడు అమిరిశెట్టి శ్రీనివాస్ గుప్తా, కార్యదర్శి మల్లేష్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కొండా బిక్షపతి, వార్డు సభ్యులు కొండ సత్యనారాయణ, తాండూర్ మురళి, మంద లావణ్య అంజిరెడ్డి, బక్కగారి లక్ష్మీ భూపాల్ రెడ్డి, మల్లమ్మ, కొండ సుధాకర్, సీనియర్ నాయకులు దత్తుగౌడ్, నరసింహ రెడ్డి, వెంకటేష్ గౌడ్, ప్రభాకర్ గౌడ్, కొండ మల్లేష్, చెవ్వ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.