Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని వివిధ డివిజన్ల్లో విస్త్రృతంగా పర్యటించారు. సోమవారం గౌతమ్‌నగర్ డివిజన్ పరిధిలోని న్యూ మిర్జాలగూడ చిన్మయి స్కూల్ లైన్ నాలాను, ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ పరిధిలోని శ్రీనగర్‌లో జరుగుతున్న బాక్స్ డ్రైన్ పనులను పరిశీలించి, అనంతరం వర్షంతో ఇబ్బంది పడ్డ ప్రాంతాలను గుర్తించి, ముంపు ప్రాంతాల్లో గౌతమ్‌నగర్ కార్పొరేటర్ మేకల సునీతరాముయాదవ్, ఈస్ట్ ఆనంద్‌బాగ్ కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే బాక్స్ డ్రైన్ ఏర్పాటుకు రూ.కోటీ 60 లక్షల ప్రపోజల్స్ పంపించామనీ, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే వర్షంతో ఇబ్బంది పడే ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని అన్ని డివిజన్ల్లోని బస్తీలు, కాలనీల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. తన దృష్టికి రాని సమస్యలు ఏమైనా ఉంటే కాలనీ వాసులు, టీఆర్ఎస్ నాయకులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారనీ, ఈ సమస్యలను వారి దృష్టికి తీసుకువస్తే, వారు తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తన దృష్టికి వచ్చిన రోడ్లు, డ్రయినేజీ, పార్కులో షెడ్డు నిర్మాణం, సీసీ కెమెరాలు, తదితర సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు డీఈ లౌక్య, దీపక్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పిట్ల శ్రీనివాస్, రాముయాదవ్, గుండా నిరంజన్, నాయకులు సత్యమూర్తి, బాబు, సత్యనారాయణ, గణేష్ ముదిరాజ్, నరేష్కుమార్, నవీన్‌యాదవ్, గద్వాల జ్యోతి, సంతోష్ రాందాస్, శ్రీధర్ మేరు, గౌతమ్‌నగర్, ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.