Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్లో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా జూబ్లీహిల్స్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, నవనిర్మాణ యువజన సంస్థ నిర్వాహకులు నవీన్ యాదవ్ స్థానిక కృష్ణవేణి స్కూల్ వద్ద స్టేజీ ఏర్పాటు చేసి, తన తండ్రి, సీనియర్ రాజకీయ నాయకుడు సినిమా ప్రొడ్యూసర్ చిన్న శ్రీశైలం యాదవ్, తమ్ముడు వెంకట యాదవ్‌తో కలిసి ముస్లిం నాయకులు, యువకులకు ఫ్రూట్ జ్యూస్, వాటర్ ప్యాకెట్లను పంపిణీచేశారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా జూబ్లీహిల్స్ పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. -నవతెలంగాణ, జూబ్లీహిల్స్