Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
కూకట్పల్లి సర్కిల్ బాలానగర్ డివిజన్ పరిధిలోని ఈ సేవ నుంచి రాజు కాలనీ ప్రధాన రహదారి వరకు గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో రూ. 24 లక్షల వ్యయంతో రోడ్డు వేశారు. కాగా డ్రయినేజీ మరమ్మతుల రూ.18 లక్షల వ్యయంతో పనులు చేపట్టి, రోడ్డును తవ్వి ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని సీపీఐ(ఎం) బాలానగర్ కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్పార్టీ ఉపాధ్యక్షులు యుగంధర్ రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయలోపంతో ఇలా జరగుతోందన్నారు. ఇప్పటికైనా ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయించి, నిధులు దుర్వినియోగం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఆకుల నరేందర్, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.