Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని మతాలు, కులాలు వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ సమ ప్రాధాన్యం ఇస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో క్రిస్టియన్ అనుబంధ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకర్గంలో క్రిస్టియన్ సోదరులకు ఎప్పుడూ అండగా ఉంటామని, ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలు కేవలం కులాలు, మతాలు మధ్య చిచ్చు పెట్టాలని మాత్రమే చూస్తున్నాయని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన చెప్పారు.