Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
దుర్యోధన పాత్రలో నటుడు బందా మయసభ ఏక పత్రాభి నయంతో ప్రేక్షకులను ఆకట్టుకోగా, జంగయ్య గౌడ్ కషునిగా, సుందరరామ కష్ణ దుర్యోధనుడుగా, మంగపతి అర్జునునిగా శ్రీ కష్ణ రాయబారంలోని శయన దశ్యంలో పద్యాలను పోటాపోటీగా పాడి శ్రోతలను పరవసుల చేశారు. సత్య హరిచంద్రునిగా శివాజీ ఏక పాత్రలో సంభాషనల్తో రక్తి కట్టించారు. శ్రీత్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదిక పై మంగళవారం కల్పన కళా నికేతన్ నిర్వహణ లో రాష్ట్ర భాషాసాంస్కతిక శాఖ సౌజన్యంతో పంచ గురువందనం పేరిట కరోనా కాలంలో మతి చెందిన రంగస్థల ప్రముఖులను స్మరిస్తూ పౌరాణిక నాటకాలలోని దశ్యాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సౌజన్యదాత విజయకుమార్ పాల్గొని కళాకారులను అభినందించారు. ప్రముఖకవి డాక్టర్ ఎమ్. కె.రాము అధ్యక్షత వహించి మాట్లాడుతూ తెలుగును పరిరక్షించుకొనేందుకు పద్య నాటకాలు దోహద పడతాయన్నారు. లోకం కష్ణయ్య, హనుమంత రాయ శర్మ తదితరులు పాల్గొన్న సభలో రూప శిల్పి రవికుమార్, నటి సురభి జ్యోతి లను నగదు పురస్కారంతో సత్కరించారు.