Authorization
Wed April 09, 2025 09:43:34 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
నిరుద్యోగులు జాబ్‌మేళాలను సద్వినియోగం చేసుకోవాలని దమ్మాయిగూడ మున్సిపల్ చైర్పర్సన్ వసుమతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ అన్నారు. గురువారం దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయంలో వివిధ కంపెనీల ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదని యువతీ యువకులు బాధపడకుండా ప్రయివేటు కంపెనీలలో టాలెంట్‌కు తగిన జాబ్‌లు వచ్చినప్పుడు స్వీకరించాల్సిన అవసరం ఉందన్నారు. జాబ్ మేళాలో శుభ గృహ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్‌లో 25 మంది స్టాఫ్‌ను రిక్రూట్ చేసుకున్నామని కంపెనీ మేనేజర్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్వామి పాల్గొన్నారు.