Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరంలాంటిదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కీసర గ్రామానికి చెందిన రాజుకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ. లక్ష విలువైన చెక్కును లబ్ధిదారుడికి అందజేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో కీసర టీఆర్ఎస్ అధ్యక్షుడు జలాల్పురం సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రామారం సుజాత, శీలం మల్లేష్, పుండ్రు మల్లేష్, గ్రామశాఖ అధ్యక్షుడు చినింగని బాల్రాజ్, ప్రధాన కార్యదర్శి రాగుల గణేష్, వైస్ ప్రెసిడెంట్ సుమన్ బన్నీ, కీసర మండల మీడియా అధ్యక్షులు గోరంటి ప్రవీణ్, రాగుల రమేష్, శివరాజ్, మంగ తదితరులు పాల్గొన్నారు.