Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరామర్శించిన సీపీఐ(ఎం)నేతలు
నవతెలంగాణ-ఓయూ
హబ్సిగూడా డివిజన్ రవీందర్ నగర్లో సీహెచ్ పర్వతాలు, భార్య నిరంజనమ్మ పూరి గుడిసెలో నిద్రిస్తుండగా మంగళవారం మధ్యరాత్రి మంటల్లో గుడిసె పూర్తిస్థాయిలో కాలిపోయింది. గుడిసెలోని వస్తువులన్నీ పూర్తిగా దగ్ధంకాగా, సుమారు రెండు లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని వద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. పర్వతాలు దినసరి కూలి కాగా, అయిన భార్య ఇళ్ల లో పనికి వెళ్లి కుటుంభం పోషించు కుంటున్నారు. ఈ వలస కూలీల విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) నాయకులు ఎర్రం శ్రీనివాస్, సుభాని, రమేష్ వారి వద్దకు వెళ్లి పరామర్శించారు. పార్టీ ద్వారా తగినంత సహాయం చేస్తామని సీపీఐ(ం) కార్యదర్శి ఎర్రం శ్రీనివాస్ వారికి హామీ ఇచ్చారు.
కనీసం స్పందించని అధికారులు
ఘటన జరిగిన నేటి వరకు స్థానిక స్థానిక ఎమ్మెల్యే కానీ, తహసీల్దార్, సంబంధిత అధికారులు గుడిసె పరిశీలించలేదని, దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోనే ఉన్న బియ్యం, వంట సామాగ్రి పూర్తిస్థాయిలో కాలిపోవడంతో వారు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. బడాబాబుల ఆస్తినష్టం జరిగితే వెంటనే స్పందించే నేతలు, అధికారులు మరి ఈ వలస కూలీల వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదని ఇదేం వివక్షత అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.