Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జమ్మికుంట అర్బన్ ఇన్చార్జి ఆర్వి మహేందర్ కుమార్
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని జమ్మికుంట అర్బన్ ఇన్చార్జ్ ఆర్వి మహేందర్ కుమార్ అన్నారు గురువారం హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారని తెలిపారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ప్రజలపై అదనపు భారాలు మోపుతూ ప్రజలను ఎలా ఓట్లు అడుగుతారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివద్ధి చెందుతుందని తెలిపారు. ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి తెలంగాణా ఆత్మ గౌరవం నిలబెట్టాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా తనను జమ్మికుంట అర్బన్ ఇన్చార్జిగా నియమించిన సీఎం కేసీఆర్‌కు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు కతజ్ఞతలు తెలిపారు.