Authorization
Wed April 09, 2025 11:48:44 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
నెహ్రూ జూపార్క్‌లో 'మనోహర్'ను (ఆఫ్రికన్ సింహం) ఒక సంవత్సరం పాటు ఆరిజీన్ ఫార్మాస్యూటికల్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రతినిధులు దత్తత తీసుకున్నారు. ఈమేరకు శుక్రవారం జూపార్క్‌ను సందర్శించి లక్ష రూపాయలు చెక్కును క్యూరేటర్ ఎస్. రాజశేఖర్‌కు అందజేశారు. దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చిన ఆరిజీన్ ఫార్మాస్యూటికల్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.