Authorization
Thu April 10, 2025 01:26:06 am
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేలా కృషి చేస్తానని రంగారెడ్డినగర్ డివిజన్ కార్పొరేటర్ బి.విజరుశేఖర్గౌడ్ అన్నారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో నెలకొన్న ప్రజా సమస్యలపై ఆయన పాదయాత్ర నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానన్నారు. వీలైనంత త్వరలోనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ మల్లారెడ్డి, ఎలక్ట్రికల్ ఏఈ శంకర్, వాటర్ వర్క్స్ మేనేజర్ రోహిణి, వర్క్ ఇన్స్పెక్టర్ కిషోర్, బస్తీల నాయకులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.