Authorization
Thu April 10, 2025 07:59:52 am
నవతెలంగాణ-దుండిగల్
హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ సీనియర్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా మల్లన్నపల్లెకు చెందిన వికలాంగురాలు వెంకట లక్ష్మీ అనే ఆడబిడ్డ బీఈడీ విద్యాభ్యాసం చేసి ఆరు సంవత్సరాలు గడుస్తుందని, తెలంగాణ వస్తే.. తన బతుకు మారుతుందని ఆశ పడ్డానని.. కానీ తెలంగాణ వచ్చి ఏండ్లు గడుస్తున్నా చదువుకున్న విద్యార్థులకు నోటిఫికేషన్ మాటలేదు ఆవేదన వ్యక్తం చేసింది. పోనీ ఏదైనా కూలీనాలీ చేసుకుని బతుకుదామంటే ఇక్కడి పల్లెలో తమ చదువుకు సరిపడా ఎటువంటి ఉపాధి లేదని ప్రభుత్వం సహకరించే పరిస్ధితి లేదని తన కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలనో తెలియక కన్నీటి పర్వంతం అయ్యింది. ప్రభుత్వానికి తగిన రీతిలో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నామంటూ వాపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, తెలంగాణ కిసాన్ ్ చైర్మెన్ అన్వేష్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డికి తన కష్టాలు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది.