Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
ప్రేరణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం మల్కాజిగిరి జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలోని 150 మంది విద్యార్థులకు శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఫౌండర్ శరత్ సుదర్శి మాట్లాడుతూ అమ్మాయిలు రుతుస్రావ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలనీ, లేదంటే భవిష్యత్లో యోని, గర్భాశయ సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. పేద పిల్లలు శానిటరీ ప్యాడ్స్ వాడే ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రుదుస్రావ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్లో ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు అన్నారు. ముఖ్యంగా పరిశుభ్రత పాటించాలనీ, మంచి ఆహారం తీసుకోవాలనీ, పేదరికం వల్ల చాలా మంది ఆ రోజుల్లో అపరిశుభ్రతమైన గుడ్డను ఉపయో గించడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, అందుకే రుతుస్రావం సమయంలో తీసుకో వాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని ప్రేరణ భావించి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే అమ్మాయిలకు ప్రేరణ ఆధ్వర్యంలో శానిటరీ ప్యాడ్స్ అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాన్య, మంగ, ప్రవీణ్, సౌజన్య, అభిషేక్, జీవన్ పాల్గొన్నారు.