Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు దమ్మాయిగూడ పురపాలక పరిధిలో ఛైర్మెన్ వసూపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ మాదిరెడ్డి వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ స్వామి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కవర్స్ నిషేధంపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రజలందరూ ప్లాస్టిక్‌ను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ప్లాస్టిక్ సంచులు వద్దు అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. వృత్తి వ్యాపారాలు, కూరగాయలు అమ్మే వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్లకి ప్లాస్టిక్ సంచులు వాడటం వల్ల కలిగే దుష్ప్రయోజనాల గురించి వివరించి 75 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ సం చులను వాడవద్దని సూచించారు. బట్ట సంచులను వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దమ్మాయి గూడ మున్సిపల్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంపన్న బోల్ హరిగౌడ్, ఖాజా బారు పాల్గొన్నారు.