Authorization
Thu April 10, 2025 01:00:37 am
- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రభుత్వం అందించే రుణాలను అర్హులైన వారు సద్విని యోగం చేసుకుని ఆర్థికంగా రాణించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్ అన్నారు. జిల్లాలోని ఉప్పల్ రింగ్ రోడ్డు మేకల భారతి గార్డెన్స్‌లో జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తదీన రుణ మేళా నిర్వహించనున్న నేపథ్యంలో కలెక్టర్ మాట్లా డుతూ జిల్లాలోని బ్యాంక్ ఆధ్వర్యంలో ఆయా బ్యాంకులు సంయు క్తంగా రుణ మేళా నిర్వహించనున్నట్టు పేర్కొన్నా రు. ఈ రుణమేళా కార్యక్రమానికి అర్హులైన లబ్ధిదారులు హాజరై రుణాలను పొందేందుకు వీలుంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ రుణమే ళాలో అర్హులైన లబ్ధిదారులకు ఇంటి రుణాలు, విద్యార్థులు చదువుకునేందుకు, వ్యవసాయ రుణాలతోపాటు స్వయం సహాయక సంఘాలకు రుణాలు, వ్యాపార రుణాలు అందించనున్నట్టు తెలిపారు. రుణ మేళాలో ఆయా బ్యాంకులు అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందించేందుకు ముందుకు వస్తాయనీ, అలాగే లబ్ధిదారులు సైతం రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా రాణించి వాటిని సకాలంలో చెల్లించాలని కలెక్టర్ హరీష్ కోరారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కిషోర్ మాట్లాడుతూ 26వ తేదీన జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికారులు బ్యాంకుల వారు హాజరై రుణాలను అర్హులకు అందజేస్తారని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు రుణ మేళాకు హాజరై వారికి ప్రభుత్వం అందించే రుణాలను తీసుకుని ఎప్పటి కప్పుడు చెల్లిస్తూ మళ్లీ రుణాలు పొందేలా చూసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ కిషోర్ పేర్కొన్నారు.