Authorization
Thu April 10, 2025 03:55:55 am
- మెడికల్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్ల అవగాహనా సదస్సులో ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్‌రెడ్డి
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
మాదకద్రవ్యాల నివారణ నగరంగా హైదరాబాద్ నగరం ఉంటుందని డీసీపీ, జాయింట్ కమిషనర్ రమేష్‌రెడ్డి అన్నారు. ఈస్ట్‌జోన్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో మెడికల్ షాపులు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ ఏజెన్సీల నిర్వాహకులతో కలిసి వైద్యశాఖ, ఎక్సైజ్, పోలీస్ ఇతర అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ రమేష్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని గంజాయి, మాదకద్రవ్యాల నివారణ నగరంగా అన్ని శాఖల సమన్వయంతో తీర్చిదిద్దు తామన్నారు. మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ దుకాణాల నిర్వాహ కులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే మందులు ఇవ్వకూడద న్నారు. మత్తు వచ్చే ఔషధాలను ప్రజలకు అందుబాటులో ఉంచకూడదని సూచించారు. మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, దుకాణదారులు దానికి సమ్మతం తెలిపారు. పోలీసులకు సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు. పోలీస్‌శాఖ కంట్రోల్ బోర్డ్ వెబ్సైట్ డాట్ కాం ఆరోగ్యశాఖ సమాజం కోసం ఓ సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్, అడిషనల్ డీసీపీ మురళీధర్, ఉస్మానియా ఆస్పత్రి అనస్తీషియా హెచ్ఓడీ ప్రొఫెసర్ డాక్టర్ పాండు నాయక్. డాక్టర్ ప్రేమ్ సాగర్. డ్రగ్స్ ఇన్స్పెక్టర్ రబియా, ఏసీపీలు పి.దేవేందర్, వెంకటరమణ, శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు భిక్షపతి, సుబ్బరామిరెడ్డి, ఎస్సైలు లింగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.