Authorization
Wed April 09, 2025 09:43:33 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులుగా కోటగిరి జంగయ్య మహేశ్వరం నియోజక వర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీసీ సెల్ అధ్యక్షులుగా నాదర్గుల్ గ్రామానికి చెందిన కోటగిరి జంగయ్య ఎన్నికయ్యారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా బడంగ్పేట్ కార్పొరేషన్లోని పెద్దబావి లక్ష్మమ్మ ఫంక్షన్ హాల్లో నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా జంగయ్య మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ ఎస్ పార్టీ చేస్తున్న అభివద్ధి పథకాలను ప్రజలకు తెలియజేస్తు పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో బీసీిల అభివద్ధికి, వారిని అన్ని రంగాల్లో పటిష్టం చేస్తానని తెలిపారు. తనను నమ్మి ఈ పదవీ బాధ్యతలను అప్పగించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తనకు ఈ పదవి రావడానికి సహకరించిన మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మ రెడ్డికి, కార్పొరేటర్లకు, కోఆప్షన్ సభ్యులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు అయన పేర్కొన్నారు.