Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి
నవతెలంగాణ-సిటీబ్యూరో
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని జవహర్ నగర్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ద్వారా పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బందులను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకుంటామని మేయర్ వెల్లడించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నాలాను, మున్సిపల్, పరిపాలన శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్.లోకేష్‌కుమార్, రామ్కీ ఎన్విరో సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మసూద్ మల్లిక్‌లతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసర ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని తక్షణ చర్యలు తీసుకుంటామని, ఎప్పటికప్పడు పరిశీలించి, పర్యవేక్షించి అధికారు లతో తగు ఆదేశాలు జారీచేస్తామని అన్నారు. 15 రోజులలో చేపట్టిన చర్యలను మరోసారి పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ మాట్లాడుతూ జవహర్‌నగర్ డంప్‌యార్డ్ ద్వారా వస్తున్న దుర్వాసనను తొలగించేందుకు డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ చేయించడంతో పాటు వెంటనే తొలగించేందుకు ఏజెన్సీని ఆదేశించారు. శాశ్వత పరిష్కారం కోసం అదనంగా మరో 28 మెగా వాట్ల సామర్థ్యం గల పవర్యూనిట్ను ప్రారంభిం చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్.లోకేష్‌కుమార్, జవహర్‌నగర్ మేయర్ మేకల కావ్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొని
సందర్శించారు. ఈ డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న దుర్వాసనలకు విరుగుడు చర్యలు తీసుకునేందుకు వారు తగిన ఆదేశాలను జారీ చేశారు.