Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అహైవేపై బావార్చివద్ద మారుతీ 800 కారులో డెడ్‌బాడీ లభ్యం
- అక్రమ సంబంధం కారణంగా తన కొడుకునే కోడలే చంపిందని మృతుడి తండ్రి ఫిర్యాదు
నవతెలంగాణ-హయత్ నగర్
ఓ వ్యక్తిని హత్య చేసి, మారుతీ 800 కారులో మృతదేహాన్ని ఉంచి నిందితులు పరారైన సంఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి... తన కొడుకును అక్రమ సంబంధం కారణంగా మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి తన కోడలే హత్య చేయించిందని మృతుడి తండ్రి పీర్‌సాబ్ పటేల్ శనివారం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ సురేందర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం పీర్సాబ్కు ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుళ్లు సపోటాబాగ్, ఆస్మాన్ఘాట్, మలక్‌పేట్‌లో నివాసం ఉంటున్నారు. పెద్ద కొడుకు ముస్తాక్ పటేల్(46)కు పీర్జాద్ బేగంతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. 15 సంవత్సరాల క్రితం సిటీలోని సైదాబాద్‌కు వలసొచ్చి ఇక్కడే ఉంటున్నారు. ముస్తాక్ పటేల్ (46) డ్రైవర్ కాగా, అతని భార్య కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే పీర్జాద్ బేగం మహమ్మద్ అమీర్ పటేల్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నది. ఆమె భర్త ముస్తాక్ పటేల్‌కు విషయం తెలియడంతో నిలదీశాడు. ఈ క్రమంలో భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే అదునుగా భావించిన పీర్జాద్బేగం ప్రియుడు అమీర్పటేల్, మరో వ్యక్తి నయూబ్తో కలిసి భర్త అయిన ముస్తాక్‌ను హత్య చేయించింది. శనివారం హయత్ నగర్‌లోని హైవేపై బావార్చివద్ద మారుతీ 800 వాహనంలో వెనుక సీటలో ముస్తాక్ మృతదేహాన్ని ఉంచి, శరీరంపై కారంచల్లి శివారు ప్రాంతంలో పడేసేందుకు తీసుకు వెళ్తున్న క్రమంలో హయత్ నగర్వద్దకు రాగానే కారు ఆగిపోయింది. దీంతో మృతదేహాన్ని తీసుకెళ్తున్న నిందితులు కారుతో సహా అక్కడే వదిలిపెట్టి పారిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకున్నారు.