Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఇంటర్ ఇంజనీరింగ్ బాస్కెట్ బాల్ లీగ్ టోర్నమెంట్‌ను శనివారం ఘనంగా ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి కండ్లకోయ గ్రామంలోని సీఎంఆర్ఎఫ్ ˜ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో బాస్కెట్ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ దేవదాస్ అడ్మిన్ ఆఫీసర్ సీహెచ్ శ్రీనివాస్‌రెడ్డి, కళాశాల కార్యదర్శి డాక్టర్ సీహెచ్ గోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్యార్థులకు చదువుతోపాటు ఆటలు, ఆటల పోటీలు ఎంతో ముఖ్యమని అన్నారు. బాస్కెట్ బాల్ ఆడటంవల్ల శారీర, మానసిక దృఢత్వం ఏర్పడుతుందని, మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ఆరోగ్యంగా ఉండగలుగుతారని చెప్పారు.విద్యార్థులు తాము ఇష్టపడే ఆటలను ఎంచుకొని, ప్రావీణ్యత పొంది భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో, జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయిల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. రెండు రోజుల పాటు జరిగే టోర్నమెంట్లో 12 టీమ్‌లు పాల్గొనగా ఫైనల్‌కు (ఇ.ఇ.ఇ.) డిపార్ట్మెంట్, (సి.ఎస్.ఎం)లు పోటీ పడనున్నాయి. టోర్నమెంట్ కన్వీనర్ సయ్యద్ రఫీ, ఫిజికల్ డైరెక్టర్‌తో పాటు చివరి రోజు ప్రొఫెసర్ రామరాజు, జె. రోహిణి రెడ్డి, వెంకటేశ్వర్లు, విద్యార్థులు, లెక్చరర్లు పాల్గొన్నారు.