Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా కమిషన్‌కు ఈవో అన్నపూర్ణ ఫిర్యాదు
నవతెలంగాణ-బేగంపేట
తమపై తప్పుడు ఆరోపణులు చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, చర్యలు తీసుకోవాలని బల్కంపేట టెంపుల్ ఈవో అన్నపూర్ణ బుద్ధభవన్‌లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తాను 28 ఏండ్లుగా దేవదాయ శాఖలో జూనియర్ ఆసిస్టింట్ నుంచి అసిస్టెంట్ కమిషనర్ స్టాయి వరకు ఎదిగానని అన్నారు. ఎంతో బాధ్యతగా విధులు నిర్వహించే తనపై కొందర అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.