Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కన్స్ట్రక్షన్ వరల్డ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ, సీఈవో కెవీబీరెడ్డి చేరారు. ముంబైల్లో నిర్వహించిన 7వ భారతీయ నిర్మాణ రంగం పండుగ రజతోత్సవ వేడుకల్లో ఈ అంశాన్ని వెల్లడించారు. కన్స్ట్రక్షన్ వరల్డ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-2020గా వెలుగొందుతున్న ఆయన ఇతర కన్స్ట్రక్షన్ వరల్డ్ పర్సన్స్‌తో పాటుగా పరిశ్రమకు అందించిన తోడ్పాటుకు హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చారు. ఈ సందర్భంగా కెవీబీరెడ్డి మాట్లాడుతూ... ఈ గుర్తింపునందించిన కన్స్ట్రక్షన్ వరల్డ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ.. అత్యుత్తమ సమాచారం, కనెక్షన్స్ అందిస్తూ రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్న కన్స్ట్రక్షన్ వరల్డ్‌ను అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు. పరిశ్రమలో మహౌన్నత వ్యక్తుల సరసన నిలువడమే ఓ గౌరవం అని అన్నారు. తనకోసం అవిశ్రాంతంగా తోడ్పాటునందించిన బృందానికి ఈ గుర్తింపు అంకితం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ బృందమే మహమ్మారి విసిరిన సవాళ్లను సైతం అధిగమించి ముందుకు సాగడంలో తోడ్పడటంతో పాటుగా ప్రయాణికులకు అత్యంత సురక్షితమైన రవాణా అవకాశం అందించిందని గుర్తుచేశారు. ఎల్అండ్ టీ గ్రూప్‌లో 2018లో చేరిన నాటి నుంచి హైదరాబాద్ మెట్రో రైల్‌కు ఎన్నో విజయాలను చేకూర్చినట్టు వారు ఈ సందర్భంగా తెలియజేశారు.