Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
డెంగ్యూ, టైపాడ్, మలేరియా దోమలు అభివృద్ధి చెందకుండా నివారించడానికి ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం 10 గంటల 10 నిమిషాలకు (పీపీపీ) కార్యక్రమం తప్పకుండా చేపట్టాలని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ పీ.భోగేశ్వర్ తెలిపారు. ఆదివారం పది గంటల పది నిముషాల కార్యక్రమంను బౌరంపేటలోని గోకుల్ బృందావనం కాలనీలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ మాట్లాడుతూ దోమలు వృద్ధి చెందకుండా, డెంగ్యు, టైఫాడ్, మలేరియా లాంటి వ్యాధులను నివారించడానికి పరిసరాల్లో దోమలు వృద్ధి చెందే చోట్ల, కూలర్స్, పూల కుండీలు, వాటర్ ట్యాంక్లు, టైర్లు, వాడిన కొబ్బరి బొండాల్లో నీళ్ళు నిలువ ఉండకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం చేపట్టి దోమలు వృద్ధి చెందకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బుచ్చిరెడ్డి, కాలనీ అసోసియేషన్ పెద్దలు, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.