Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
టీఆర్ఎస్ మల్కాజిగిరి సర్కిల్ మహిళా జనరల్ సెక్రెటరీగా స్వాతి దీపక్‌కుమార్‌ను నియమిస్తూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆదివారం ఆమెకు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్వాతి దీపక్‌కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవి కట్టబెట్టిన ఎమ్మెల్యే మైనంపల్లికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరే విధంగా పని చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేసి మహిళలను ఎక్కువగా పార్టీకి చేరువ చేసే విధంగా పని చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌతమ్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీతరాముయాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాముయాదవ్, ప్రసాద్‌యాదవ్, గద్వాల జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.