Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రముఖ పర్యావరణ వేత్త నంబూరి కృష్ణంరాజు పిలుపునిచ్చారు. ఆదివారం కాప్రా డివిజన్ ఈశ్వరపురి కాలనీలోని తన నివాసం వద్ద వివిధ రకాల మొక్కలు, పక్షి గూళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాల మనుగడకు ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కలతో వాతావరణంలో సమతుల్యతలు దెబ్బతిన కుండా ఉంటుందన్నారు. మొక్కలు పెంచడం వల్ల సమ యానికి వర్షాలు పడటమే కాకుండా వాయు కాలుష్యం తగ్గుతుందన్నారు. పక్షులను పెంచేందుకు అవసరమైన పక్షి గూళ్ళును ఉచితంగా అందజేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. రెండు దశాబ్దాలుగా వివిధ రకాల మొక్కలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నా మని తెలిపారు. మొక్కలు అవసరమైన వారు నేరుగా తనను సంప్రదించవచ్చని తెలిపారు.