Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మందకృష్ణ పోరాటానికి మద్దతు
- కేంద్ర మంత్రులు మురిగాన్, నారాయనస్వామి, జి.కిషన్రెడ్డి
నవతెలంగాణ-కంటోన్మెంట్
ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అనీ, కేంద్ర మంత్రులు మురిగాన్, నారాయణ స్వామి, కిషన్రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి వీఆర్ గార్డెన్లో మాదిగ ఫెడరేషన్ ఎంప్లాయీస్ మాదిగ ఉద్యోగుల జాతీయ మహా సభ ఆధ్వర్యంలో జరిగిన సభకు వారు హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ జాతి ఏండ్లుగా ఎదరు చూస్తుందన్నారు. వర్గీకరణకు కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయశాఖ మంత్రి, తాను ముగ్గురం కలిసి చర్చించనున్నట్టు తెలిపారు. గతంలో వర్గీకరణ వద్దు అని ఐదుగురు న్యాయమూర్తులు కావాలనీ, ఐదుగురు న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారనీ, మరో బెంచ్ ఏర్పాటు చేయాలనీ, ఇందుకు కృషి చేస్తానని వెల్లడించారు. అంతకు ముందు మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఉష మెహర కమిషన్ రిపోర్టును అమలు చేయాలన్నారు. పార్ల మెంట్లో జాతీయ వర్గీకరణ పెండింగ్లో ఉందనీ, మం త్రులుగా ఉన్న మీపై మాదిగ జాతి ఆధారపడి ఉంద న్నారు. మాదిగ జాతి మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తు న్న విషయాన్ని మంత్రులకు ఈ సందర్భంగా గుర్తు చేశారు. నవంబర్ 14న చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటు ందనీ, ఈ కార్యక్రమానికి దళిత జాతి మొత్తం ఢిల్లీకి రావా లని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, భిక్షాల్ మాదిగ, శ్రీనివాస్, కాశీం, బీజేపీ మహిళా మోర్చ మహిళా నాయకురాలు ఆకుల విజయ, రాములు, వివిధ రాష్ట్రల నుంచి పెద్ద ఎత్తున ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.a