Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బీపీ, షుగర్ మెడికల్ క్యాంప్‌ను విజయ వంతంగా 74 నెలలుగా నిర్వహించడం అభినందించదగిన విషయమని గోధు మకుంట సర్పంచ్ అకిటి మహేందర్ రెడ్డి అన్నారు. జన విజ్ఞాన వేదిక కాప్రా, కీసర, మల్కాజ్గిరి మండల కమిటీ ఆధ్వర్యంలో బీసీ, షుగర్ 74వ నెల మెడికల్ క్యాంపును ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కీసర మండలంలోని గోధుమకుంట గ్రామ సర్పంచ్ అకిటి మహేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. జన విజ్ఞాన వేదిక 74 నెలలుగా బీసీ, షుగర్ బాధితులకు మెడికల్ క్యాంప్ నిర్వహించడం, కరోనా కష్ట సమయంలో కూడా మెడికల్ క్యాంప్‌ను కొనసాగించడం అభినందనీయం అన్నారు. జన విజ్ఞాన వేదికకు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. జనవిజ్ఞాన వేదిక మేడ్చల్ జిల్లా నాయకులు ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ మెడికల్ క్యాంపుతో ఆరేండ్లు విజయవంతంగా నిర్వహించుకుని ఏడో ఏడాదిలోకి అడుగు పెట్టడం జన విజ్ఞాన వేదిక కాప్రా, కీసర, మల్కాజిగిరి మండల కమిటీల నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషి ఫలితం అన్నారు. అనంతరం ఈ క్యాంప్‌కు వచ్చిన 150 మంది పేషెంట్స్‌కి డాక్టర్లు పరీక్షలు చేసి వారికి కావాల్సిన మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దశరథ్, డాక్టర్ విద్యాసాగర్, జనవిజ్ఞాన వేదిక కాప్రా, కీసర, మల్కాజిగిరి మండల అధ్యక్షులు జంగయ్య, నర్సింహులు, ప్రధాన కార్యదర్శిలు వెంకట్ రమణ, చౌదరి, శివప్రసాద్ నాయకులు శేషు, బసవ పున్నయ్య, రాజన్ సింగ్, సోమయ్య చారి, ఆండాలి, బుచ్చిరెడ్డి, రవి, రమణరెడ్డి, సురేష్, నాగేశ్వరరావు, కరుణాకార్ రెడ్డి, రామ్మోహన్రావు పాల్గొన్నారు.