Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
భారత విద్యార్థి ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పడాల శంకర్ మాట్లాడుతూ మేడ్చల్ జిల్లాలో విద్యార్థి ఉద్యమ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ఎస్ఎఫ్ఐ ముందుంటుందన్నారు. కరోనా అనంతరం ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నిలబడి విద్యార్థుల పక్షాన పోరాడుతున్నామని తెలిపారు. మేడ్చల్ జిల్లా కమిటీ సమావేశం సందర్భంగా జిల్లా విద్యా రంగ పరిస్థితుల గురించి చర్చించారు. కేం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన లేకుండా తమకు ఇష్టమొచ్చినట్టుగా విద్యారంగ మార్పులు చేసుకుంటూ పోతూ, శాస్త్రీయ విద్యా విధా నానికి దూరంగా తీసుకెళ్తున్నారు, ఒకవైపు విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయకుండా ఇంకోవైపు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయ కుండా కార్పొరేట్‌కి కొమ్ముకాస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల కోసం తప్ప ప్రజల కోసం పని చేసే నాథుడే లేడన్నారు. ఈ ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలను విద్యార్థుల్లోకి తీసుకెళ్తామన్నారు. సంఘం బలోపేతమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్, చంద్రకాంత్, జిల్లా సహాయ కార్యదర్శి అఖిల, కమిటీ సభ్యులు శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.